CM Jagan : నరకాసురుడిని నమ్మొచ్చేమో.. కానీ, చంద్రబాబును మాత్రం నమ్మొద్దు : సీఎం జగన్

హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరకు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని ఆరోపించారు.

CM Jagan : నరకాసురుడిని నమ్మొచ్చేమో.. కానీ, చంద్రబాబును మాత్రం నమ్మొద్దు : సీఎం జగన్

Updated On : May 26, 2023 / 3:25 PM IST

Jagan Fired Chandrababu : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్కరికి కూడా ఇళ్ల పట్టా ఇవ్వలేదన్నారు. రైతులు, నిరుద్యోగులు, అక్కాచెళ్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని పేర్కొన్నారు.

హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరకు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని ఆరోపించారు. మోసం చేసేవారిని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. నరకాసురుడిని నమ్మొచ్చేమో కానీ, చంద్రబాబును మాత్రం నమ్మొద్దు అని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారని మండిపడ్డారు.

TDP Mahanadu : తెలుగుదేశం మహానాడు.. ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు

ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకుంటారని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా దోచుకో, పంచుకో, తినుకో అన్న చందంగా కొనసాగిందని విమర్శించారు. పేదలకు మంచి చేయాలన్న ఆలోచన టీడీపీ నేతలకు లేదని విమర్శించారు. తాము మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి అమలు చేశామని పేర్కొన్నారు.