Chandrababu Naidu: సీఎం ప్రజలను హోల్‌సేల్‌గా దోపీడీ చేస్తున్నారు – చంద్రబాబు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను హోల్ సేల్ గా దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మీగడంతా ఆయనే మింగేసి ప్రజలకు మజ్జిగ పోస్తున్నారంటూ విమర్శించారు.

Cbn Ys Jagan
Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను హోల్ సేల్ గా దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మీగడంతా ఆయనే మింగేసి ప్రజలకు మజ్జిగ పోస్తున్నారంటూ విమర్శించారు. కొవిడ్ బాధితులను.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఏ మేర ఆదుకుందో వివరాలతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
బంగారు గుడ్డు పెట్టే అమరావతిని నాశనం చేశారు. అమరావతిలో వేసిన ఎస్ఆర్ఎం, విట్ విత్తన ఫలితాలు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందుతోంది. ఏపీ ప్రజలపై పెట్రోల్, డీజిల్, నిత్యవసరాలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి పన్నుల భారం మోపారు.
యుద్ధ ప్రాతిపదికన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం కోలుకునేందుకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందించాలి. ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల వారికి రూ.7500 ఇవ్వాలి.
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షలు, ఆక్సిజన్ లేక చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షలు, చనిపోయిన ఫ్రంట్‌లైన్ వారియర్ కుటుంబాలకు రూ.50లక్షలు చొప్పున సాయం అందించాలి. ప్రభుత్వం ప్రకటించినట్లుగా కోవిడ్ వచ్చిన వారికి రూ.2వేలు, చనిపోయిన వారి దహన సంస్కారాలకు 15వేలు అందజేయాలని డిమాండ్ చేశారు.