Chandrababu Fires On Jagan : ఏ మహానాడులోనూ ఇంత కసి చూడలేదు, జగన్‌కు నిద్ర పట్టదు-చంద్రబాబు

ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని అన్నారు.

Chandrababu Fires On Jagan : ఏ మహానాడులోనూ ఇంత కసి చూడలేదు, జగన్‌కు నిద్ర పట్టదు-చంద్రబాబు

Chandrababu Fires On Jagan

Updated On : May 28, 2022 / 8:07 PM IST

Chandrababu Fires On Jagan : మహానాడు వేదికగా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదన్నారు చంద్రబాబు. ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారని చెప్పారు. మనకు జనాలు ఉన్నారు, వారికి బస్సులున్నాయి అని అన్నారు. అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవు అన్నారు.

మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారని, మహానాడు వాహనాలకు గాలి తీసేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగ్ లు కళ కళ అన్నారు.

Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్

”భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. ఏడాది పాటు ఎన్టీఆర్ జయంత్యుత్సవాలు చేపడుతున్నాం. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతాం” అని చంద్రబాబు తెలిపారు.

Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..

”కాకినాడలో సుబ్రమణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేస్తే దాచి పెట్టే ప్రయత్నం చేశారు. మేం పోరాటం చేస్తే ఎమ్మెల్సీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన మీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు..? గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారు. చిత్తశుద్ది ఉంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించు జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..? వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐపై బాంబులేస్తారట” అని ధ్వజమెత్తారు చంద్రబాబు.