టికెట్ దక్కని నేతలకు చంద్రబాబు కీలక హామీ

జగన్ తమని మోసం చేశాడనే భావన ప్రతీ బీసీలోనూ ఉందన్న చంద్రబాబు.. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన తెలుగుదేశంలో వారికెప్పుడూ ప్రాధాన్యం తగ్గదన్నారు.

టికెట్ దక్కని నేతలకు చంద్రబాబు కీలక హామీ

Chandrababu Naidu Key Promise

Updated On : February 16, 2024 / 8:21 PM IST

Chandrababu Naidu : టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని చంద్రబాబు కోరారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని హామీ ఇచ్చారాయన.

జగన్ తో విసిగిపోయిన చాలామoది వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరతాం అంటున్నారని చంద్రబాబు చెప్పారు. మంచి వారై ఉండి, పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే తీసుకుంటున్నాము అని తెలిపారు. అలాంటి చేరికలను ప్రోత్సహించి కలిసి పని చేయాలని సూచించారు చంద్రబాబు.

Also Read : గుంటూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే?

రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడతాను అని చంద్రబాబు తెలిపారు. మరో 50 రోజులే సమయం ఉన్నందున ప్రతీ ఒక్కరూ సీరియస్ గా పని చేయాలన్నారు చంద్రబాబు. ఇప్పటి వరకూ జరిగిన బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందని, ప్రతీ నియోజకవర్గంలోనూ బీసీ సాధికార సభలు నిర్వహించి తీరాలని పార్టీ నేతలతో తేల్చి చెప్పారు. జగన్ తమని మోసం చేశాడనే భావన ప్రతీ బీసీలోనూ ఉందన్న చంద్రబాబు.. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన తెలుగుదేశంలో వారికెప్పుడూ ప్రాధాన్యం తగ్గదన్నారు.

Also Read : పిఠాపురం సీటు ఎందుకంత హాటు? గెలుపుపై పార్టీల ధీమా వెనుక కారణమేంటి