Chandrababu : ఓటమి భయంలో వైసీపీ, అందుకే ఓటర్ల లిస్టులో అక్రమాలకుపాల్పడుతున్నారు : చంద్రబాబు
ఓటర్ల లిస్టులో జరుగుతున్న అక్రమాలపై TDP స్పెషల్ డ్రైవ్.ఓటర్ల లిస్టులో జరుగుతున్న అక్రమాలపై నిరంతం పోరాటం. TDP నేతలకు చంద్రబాబు ఆదేశాలు.

Chandrababu AP voter list
Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఓటర్ల లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల లిస్టులో జరుతున్న అవకతవకలపై టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. దీని కోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఓటర్ల లిస్టులో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టాలని..దానికి తగిన ఆధారాలు సేకరించాలని ఓటర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. ఓటర్ల లిస్టులో జరుగుతున్న అక్రమాలపై నిరంతం పోరాటం చేయాలని సూచించారు. దీంట్లో భాగంగానే టీడీపీ నేతలు దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇప్పటికే 20 లక్షల దొంగ ఓటర్లను గుర్తించామని టీడీపీ నేతలు తెలిపారు.
Varla Ramaiah: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ మరణం హత్యే: వర్ల రామయ్య
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఇటువంటి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ల పేర్లను తొలగిస్తు అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఇదే పనిలో ఉన్నారు అంటూ ఆరోపించారు. ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలపై న్యాయపోరాటం చేస్తామని ఈసీ దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చేసిన ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వైసీపీ నేతలు అధికారులను భయపెట్టి ఇటువంటి పనులు చేయిస్తున్నారని..గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇటువంటి అక్రమాలే చేశారని..అలాగే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటువంటి దారుణాలకే పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఓటర్లు కూడా తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని ఇది ప్రతీ ఓటరు బాధ్యత, హక్కు అని సూచిస్తున్నారు.
కాగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల లిస్టులో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీకావు. తిరుపతి ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టులో ఫేక్ ఓటర్ల లిస్టు భారీ అక్రమాలు జరిగాయని గుర్తించారు సీఐటీయూ నేతలు. ఒక వ్యక్తి పేరుతో రెండు కాదు మూడు కాదు ఏకంగా 11 ఓట్లు ఉన్నాయి..అంతేకాదు ఆ 11 ఓట్లు ఉన్న వ్యక్తికి 11మంది తండ్రులు ఉన్నారని తేలింది.