Chandrababu Naidu: 3 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు కామెంట్స్

ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయలేదని చెప్పారు.

Chandrababu Naidu: 3 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు కామెంట్స్

chandrababu

Updated On : December 14, 2023 / 4:21 PM IST

Michaung cyclone: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తుపాను హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.

పంట నష్టాన్ని ప్రభుత్వం తగ్గించే పరిస్థితులున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే రైతులకు పంట ముందుగానే చేతికి వచ్చేదని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపానుల బారి నుంచి పంటలు కాపాడుకునేవాళ్లమని చెప్పారు.

ప్రాజెక్టుల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. కొన్ని ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. సీఎం, మంత్రులు కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో వ్యవస్థలను నాశనం చేశారని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయలేదని చెప్పారు. రైతులకు ఎంత పరిహారం ఇస్తారో ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదని అన్నారు. తుపాను నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు.

మార్చిలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్స