అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు : చంద్రబాబు

చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, వైసీపీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తోపాటు మూడు పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.

అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు : చంద్రబాబు

Chandrababu Naidu

Updated On : June 4, 2024 / 7:21 AM IST

AP Assembly Election Results 2024 : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అయితే, ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, వైసీపీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో పాటు మూడు పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Also Read : గెలుపెవరిది? ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ.. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం

ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు .నిబంధనలకు కట్టుబట్టాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దని చంద్రబాబు సూచించారు. కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలి. ప్రతిఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను.. కౌంటింగ్ లో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలి. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దు. ప్రతిఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.