తండ్రి ఎస్.. కొడుకు నో.. : జగన్ వీడియో బయటపెట్టిన చంద్రబాబు
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంపై చంద్రబాబు స్పందించారు. మండలి రద్దుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. కౌన్సిల్ కు రాజకీయాలు

ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంపై చంద్రబాబు స్పందించారు. మండలి రద్దుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. కౌన్సిల్ కు రాజకీయాలు
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంపై చంద్రబాబు స్పందించారు. మండలి రద్దుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. కౌన్సిల్ కు రాజకీయాలు ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారనే ఆక్రోశంతోనే మండలిని రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. మండలి సమావేశాలకు ఏడాదికి రూ.60 కోట్లు పెట్టడం అనవసరం అంటున్నారు.. మరి.. జగన్ ప్రతివారం కోర్టుకి వెళ్లాలంటే ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుంది.. దాని గురించి ఏమంటారని చంద్రబాబు ప్రశ్నించారు.
స్వార్థం కోసం మాట మార్చే వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి గన్నవరం ఎమ్మెల్యేని భయపెట్టారని, ఎమ్మెల్సీ పోతుల సునీతను ప్రలోభ పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఆపరేసన్ ఆకర్ష్ కాదా..? అని అడిగారు. మీ విలువలు ఏమయ్యాయని జగన్ ని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీలను జగన్ ప్రలోభ పెట్టారని, బ్లాంక్ చెక్కులు ఇస్తామని అన్నారని చంద్రబాబు చెప్పారు.
ఈ సందర్భంగా.. మండలి గురించి గతంలో సీఎంగా ఉన్న సమయంలో(2007 ఏప్రిల్ 2) వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన వీడియోని, రీసెంట్ గా మండలి గురించి జగన్ మాట్లాడిన వీడియోని(2020 జనవరి 22) చంద్రబాబు ప్రదర్శించారు. మండలికి వైఎస్ ఎస్ అని చెబితే.. కొడుకు జగన్ నో అంటున్నారని చంద్రబాబు చెప్పారు. వైఎస్ ఆశయాలు నెరవేరుస్తాననే వ్యక్తి.. మండలిని ఎందుకు రద్దు చేశారని చంద్రబాబు నిలదీశారు. తండ్రి ఆశయాలు నెరవేర్చడం అంటే ఇదేనా? అని జగన్ పై ఫైర్ అయ్యారు.
మండలి రద్దుపై చంద్రబాబు కామెంట్స్:
* మండలి రద్దుని తీవ్రంగా ఖండిస్తున్నా
* మండలి రద్దు తీర్మానం దురదృష్టకరం
* బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారనే ఆక్రోశంతోనే మండలి రద్దు
* 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 86మందిపై క్రిమినల్ కేసులున్నాయి
* వైసీపీ ఎమ్మెల్యేలు నేరస్తుల ముఠా
* ఆ నేరస్తుల ముఠానే ఇంటలెక్చ్యువల్స్ అనే పరిస్థితికి వచ్చారు
* మండలికి రూ.60 కోట్ల ఖర్చు అంటున్న జగన్.. ప్రతీ వారం కోర్టుకి వెళ్లేందుకు రూ.60లక్షలు ఖర్చు పెడుతున్నారు
* మండలిలో టీడీపీ చేసిన తప్పేంటి..?
* ఇంటి దగ్గర ఖర్చుకే రూ.40కోట్లు పెట్టిన జగన్ కు.. మండలి ఖర్చు ఎక్కువైందా..?
* అసెంబ్లీలో ఉన్న నేరస్తుల ముఠాను జగన్ కీర్తిస్తున్నారు
* మండలి కావాలని 10 రాష్ట్రాలు కేంద్రాన్ని అడిగాయి
* కోర్టుకి వెళ్లేందుకు సెక్యూరిటీ కోసం ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్లు మండలికి ఏడాదికి రూ.60 కోట్లు ఇవ్వలేరా.?
* 8 నెలల్లో 42 బిల్లులు పాస్ అయ్యాయి.. ఎక్కడ అడ్డుపడ్డాం
* ఇంగ్లీష్ మీడియం బిల్లుకు ఆప్షన్ ఇవ్వమని మాత్రమే సరవణ కోరాం
* వందల మందికి ఎమ్మెల్సీలుగా చాన్స్ ఇస్తానన్న జగన్ ఏం చేస్తారు?
* మండలిలో మెజార్టీ సభ్యులు బడుగు బలహీన వర్గాల వారే
* అడ్వకేట్ కు రూ.5 కోట్లు ఇచ్చిన సీఎం.. కౌన్సిల్ కు రూ.60 కోట్లు వేస్ట్ అంటారా?