Chandrababu Naidu: వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. సుప్రీం తీర్పుపై చంద్రబాబు, లోకేశ్‌లు స్పందించారు. సీఎం జగన్ రెడ్డీ తలెక్కడ పెట్టుకుంటావ్ అంటూ ప్రశ్నించారు.

Chandrababu Naidu: వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

Chandrababu Naidu

Updated On : November 29, 2022 / 2:06 PM IST

Chandrababu Naidu: వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే, విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో సాక్ష్యాదారాలు ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. విచారణపై వివేకా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, వివేకా కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగకూదని విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ.. తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా స్పందించారు. సొంత బాబాయ్ హత్యకేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అదికూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

YS Viveka Murder Case : వైఎస్ వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీపై రేపు సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు..!

ఇదిలాఉంటే వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ  కావటం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. బాబాయ్ వివేకాను చంపించింది అబ్బాయేనని ఆరోపించారు. బాబాయ్ హత్యకేసు పక్క రాష్ట్రానికి .. అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి అంటూ లోకేశ్ ఎద్దేశా చేశాడు.