YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ.. తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ.. తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

YS Viveka Murder Case

YS Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే విచారణ బదిలీ చేయడం జరుగుతుందని తెలిపింది. అయితే, విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో సాక్ష్యాదారాలు ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. విచారణపై వివేకా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, వివేకా కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగకూదని విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

YS Viveka Murder Case : వైఎస్ వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీపై రేపు సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు..!

2019 మార్చి 15న తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. వివేకానందరెడ్డి హత్య కేసుపై మూడుసార్లు సిట్ దర్యాప్తు చేపట్టింది. 1400 మంది సాక్షులను సిట్ అధికారులు విచారించారు. 2019 మార్చి 29న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణా రెడ్డి, ప్రకాశ్‌ను అరెస్టు చేశారు. సాక్షాధారాలు మాయంచేస్తారని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. అయితే, హత్య జరిగి ఏడాది అయినా దోషులెవరో సిట్ తేల్చలేదు. 2020లో వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లో వివేకా కుమార్తె వై.ఎస్ సునీతా పిటీషన్ వేసింది. 2020 మార్చిలో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. కడప పులివెందులలో అనుమానితులు, సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. 248మంది సాక్షులను విచారించారు. 2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎర్ర గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి ని నిందితులుగా చేరుస్తూ సిబిఐ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే.. పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు: సీబీఐ

రెండో చార్జ్ షీట్‌లో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ పేర్కొంది. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ముగ్గురు నిందితులు ఉన్నారు. 2021 నవంబర్‌లో నాలుగో నిందితుడు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చాడు. వివేకాను హత్య చేస్తే డబ్బు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చిన డ్రైవర్ దస్తగిరి తెలిపాడు. శివశంకర్ రెడ్డి 40 కోట్ల సుఫారీ ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు వాంగ్మూలం దస్తగిరి పేర్కొన్నాడు. గతంలో సిబిఐ అధికారి రాంసింగ్ పై కేసు నమోదు చేసిన కడప రిమ్స్ పోలీసులు, కేసు విచారణలో జాప్యంతో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.