Chandrababu Naidu : ఏపీలో పాలన అంతా రివర్స్ .. జగన్ పాలనలో వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో పాలన అంతా రివర్స్ పద్ధతిలో జరుగుతోందని రివర్స్ గేర్లు వేసుకుంటూ సీఎం జగన్ స్పీడ్ గా వెళ్తున్నారని..దీని ఫలితంగా వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ కన్నార్పకుండా అబద్దాలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Chandrababu Jagan
Chandrababu naidu : ఆంధ్రప్రదేశ్ లో పాలన అంతా రివర్స్ పద్ధతిలో జరుగుతోందని రివర్స్ గేర్లు వేసుకుంటూ సీఎం జగన్ స్పీడ్ గా వెళ్తున్నారని..దీని ఫలితంగా వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ కన్నార్పకుండా అబద్దాలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఓ పద్ధతి పాడు లేకుండా పాలన సాగుతోందని యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలు లేక చేసుకోవానికి కనీస ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశలో మునిగిపోయారని ఇష్టానుసారపు నిర్ణయాలతో రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పెట్టుబడులు తేవటం చేతకాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘతన జగన్ కే తగ్గుతుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టామని..ఏపీలో ఉన్న అపారమైన వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమల పరంగా విజన్ 2021 ప్రకారం టీడీపీ హయాంలో పనిచేశామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడంతా విజన్ అనే మాటలేదు..కానీ రివర్స్ పాలన మాత్రం అవలంభిస్తున్నారని సీఎం జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో యువత భవిష్యత్తు అంథకారం అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సన్ రైజ్ ఏపీ అనే పేరుతో ఏపీలో పెట్టుబడులను ఆకర్షించాం అని..పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీని తయారు చేశామని..కానీ ఇప్పుడంతా జగన్ రివర్స్ పాలతో పెట్టుబడులు ఏవీ రాకపోగా వచ్చినవి కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని విమర్శించారు.
జగన్ పాలనై టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు సంధించారు. జగన్ ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన నేత కాదన్నారు. జగన్ పాలను రాష్ట్రం దివాళా తీయటమే కాదు అప్పుల కుప్పగా మారిపోయిందన్నారు. నియంత పాలతో ప్రతిపక్షాలు నోరెత్తకూడదని ప్రశ్నించకూడదనేలా వ్యవహరిస్తున్నారని కానీ చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎదుటివారిని ఆర్థికంగా దెబ్బతీసే గుణం జగన్ కు అతని తాత రాజారెడ్డి నుంచి వచ్చిందని నియంత పాలతో ప్రజల్ని నానా ఇబ్బందులకు గురిచేసే జగన్ కు ఆ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు.