Chegondi Harirama Jogaiah : కాబోయే సీఎం చంద్రబాబే..! పవన్ కల్యాణ్ వైఖరి ఏంటో చెప్పాలన్న హరిరామజోగయ్య
రాష్ట్రంలో రెండే కులాలు రాజ్యమేలుతున్నాయి. 80 శాతం ఉన్న జనాభా బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులు అందరికీ అర్థమయ్యేటట్లు సమాధానం చెప్పాలి.

Chegondi Harirama Jogaiah Letter To Pawan Kalyan
ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. తాజాగా మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు రాసిన బహిరంగ లేఖ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం పదవిపై పవన్ కల్యాణ్ వైఖరి ఏంటో చెప్పాలని హరిరామజోగయ్య అడిగారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు లేఖాస్త్రం సంధించారు.
Also Read : ఏపీలో బీజేపీ ఏం చేయబోతోంది.. టీడీపీ-జనసేనతో కలుస్తుందా?
”కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే ఆ నిర్ణయంలో రెండవ మాట లేదని లోకేశ్ ప్రకటించడాన్ని పవన్ కల్యాణ్ సమర్థిస్తున్నారా? బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న జన సైనికులకు సమాధానం చెప్పాలి..? మీరు ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి రావాలి అని కలలు కంటున్న జన సైనికులు కలలు ఏమి కావాలి..?
రాష్ట్రంలో రెండే కులాలు రాజ్యమేలుతున్నాయి. 80 శాతం ఉన్న జనాభా బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులు అందరికీ అర్థమయ్యేటట్లు సమాధానం చెప్పాలి” అని లేఖలో పవన్ కల్యాణ్ ను కోరారు హరిరామజోగయ్య.
Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

Letter To Pawan Kalyan