Amanchi Krishna Mohan: చీరాల బరిలో ఆమంచి కృష్ణమోహన్? గత రాత్రి అనుచరులతో సమావేశమై..
ఆమంచిని చీరాల నుంచి పర్చూరుకు పంపింది పార్టీ హైకమాండ్. ప్రస్తుతం పర్చూరు ఇన్‌చార్జిగా ఆయన ఉన్నారు. చీరాల టికెట్ బీసీలకు ఇస్తాననే హామీతోనే ఆమంచి పర్చూరుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

Amanchi Krishna Mohan
Chirala Politics: ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీలో చీరాల రచ్చ మళ్లీ చెలరేగుతోంది. వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల బరిలోనే నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. చీరాల బరిలో ఉంటానని ఆమంచి కృష్ణమోహన్ సంకేతాలు ఇచ్చారు.
గత రాత్రి తన అనుచరులతో సమావేశమయ్యారు ఆమంచి కృష్ణ మోహన్. మోటుపల్లిలో రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అనుచరులతో సమావేశం జరిగింది. 30 మందికిపైగా అనుచరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 10 రోజుల్లో టికెట్‌పై అధిష్ఠానం క్లారిటీ ఇస్తుందని ఆమంచి చెప్పినట్లు సమాచారం.
ఆమంచిని చీరాల నుంచి పర్చూరుకు పంపింది పార్టీ హైకమాండ్. ప్రస్తుతం పర్చూరు ఇన్‌చార్జిగా ఆయన ఉన్నారు. చీరాల టికెట్ బీసీలకు ఇస్తాననే హామీతోనే ఆమంచి పర్చూరుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
కరణం బలరాంకు టికెట్ ఇస్తే చీరాల బరిలోనే ఉంటానని ఆమంచి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఎమ్మెల్యే కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ మధ్య చాలా కాలంగా గ్రూప్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి చెక్ పెట్టేలా అధిష్ఠానం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలించలేదు.