Cm Chandrababu : మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించేందుకు వ్యూహ రచన..
ఏపీలో అర్థవంతమైన మార్పుల దిశగా వీటిని వాడుకునేందుకు యోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Cm Chandrababu : మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు చంద్రబాబు. స్టెమ్ కోర్సుల్లో అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కరోనా అనంతర పరిణామాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాముఖ్యత పెంచాయని పేర్కొన్నారు.
రిమోట్ వర్క్, కోవర్కింగ్, నైబర్ హుడ్ వర్క్ స్పేస్ కాన్సెప్ట్‌లు వచ్చాయన్నారు. ఈ కాన్సెప్ట్‌లు అనువైన, ఉత్పాదక పని వాతావరణాన్ని సృష్టిస్తాయని చెప్పారు. ఈ కాన్సెప్ట్‌లు వ్యాపారస్తులు, ఉద్యోగులకు మంచి ఫలితాలు అందిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవన్నీ మెరుగైన పని-జీవిత సమతుల్యత సాధించేందుకు సాయపడతాయన్నారు.
Also Read : రాజకీయాల్లోకి రీఎంట్రీపై.. చిరంజీవి సంచలన ప్రకటన
ఏపీలో అర్థవంతమైన మార్పుల దిశగా వీటిని వాడుకునేందుకు యోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 గేమ్ ఛేంజర్ కానుందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉపాధి కల్పించేలా ఐటీ జీసీసీ సంస్థలకు మద్దతు ఉంటుందన్నారు. రిమోట్, హైబ్రిడ్ వర్క్ ఆప్షన్ల ద్వారా ఎక్కువగా మహిళలకే లబ్ధి కలుగుతుందన్నారు చంద్రబాబు.