Cm Chandrababu: రాక్షసులపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినీ వదలను- సీఎం చంద్రబాబు

కారు కింద మనిషి పడి చనిపోయినా పట్టించుకోలేదు, ఆయన భార్యను కూడా మ్యానేజ్ చేశారు.

Cm Chandrababu: రాక్షసులపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినీ వదలను- సీఎం చంద్రబాబు

CM Chandrababu

Updated On : July 2, 2025 / 7:36 PM IST

Cm Chandrababu: కుప్పం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. రాక్షసులపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రౌడీయిజం చేస్తే వారికి అదే చివరి రోజు అన్నారు. రౌడీల ఆటలు సాగనివ్వబోమని, నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధికి అడ్డం వస్తే ఎవరినీ వదలను అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ధర్మాన్ని కాపాడతామన్నారు.

అభివృద్ధిని తాను యజ్ఞంలా చేస్తుంటే ప్రతిపక్షాల నేతలు రాక్షసుల్లా వచ్చి అడ్డు పడుతున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. తాను హత్య, శవ రాజకీయాలు చేయను అని చెప్పారు. రౌడీల ఆటలు సాగనివ్వను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినీ వదలనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

”గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వ నాశనం చేశారు. నేను నాలుగోసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు. ఆరోజు జరిగిన విధ్వంసం తక్కువ. ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం. చాలా భయమేసింది. 10లక్షల కోట్ల రూపాయల అప్పులు. వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి. అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు.

Also Read: ఏపీ ఐపీఎస్ సిద్ధార్ధ్ కౌశల్ రాజీనామా.. కారణం ఏంటంటే..

ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. వాటిని సరి చేయాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేశారు. కేంద్రం నిధులు కూడా తీసుకోని పరిస్థితి. అవన్నీ సరి చేస్తున్నాం. ఎవరైనా రౌడీయిజం చేస్తే వారికి అదే చివరి రోజు. తమాషా అనుకోవద్దు. తోక జాడిస్తే కట్ చేస్తే. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. పెత్తనం చేస్తామంటే మీ ఆటలు సాగనివ్వను. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను. ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరినీ వదలను. ధర్మాన్ని కాపాడతాం.

అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తాను. నేను యజ్ఞంలా చేస్తుంటే రాక్షసుల్లా వచ్చి ప్రజలకు ఫలితాలకు అందకుండా భగ్నం చేయాలని చేస్తున్నారు. యజ్ఞం చేయాలి, రాక్షసులపైన యుద్ధం చేయాలి, ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందిస్తాను. కనీసం మానవత్వం లేని వ్యక్తులు. కారు కింద మనిషి పడి చనిపోయినా పట్టించుకోలేదు. ఆయన భార్యను మ్యానేజ్ చేశారు. మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకుపోతే ఏదో అయిపోయింది అని చెప్పించే పరిస్థితి వచ్చారంటే.. ఈ నేరస్తులను ఏం అనాలో అర్థం కావడం లేదు. ఇన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు” అని నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు.