Cock Fights : నేతల కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివచ్చారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Cock Fights : నేతల కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

Updated On : January 16, 2025 / 6:01 PM IST

Cock Fights : రాజకీయ నేతల కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు. సంప్రదాయాలు కాపాడుతూ పండుగ వాతావరణాన్ని అంతా ఆస్వాదించాలన్నారు. చిన్నప్పటి నుంచి జల్లికట్టు చూసే వాడిని అని చంద్రబాబు చెప్పారు. జల్లికట్టును చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చే వారని అన్నారు. అన్ని ఊళ్ళల్లోనూ ఎప్పటి నుంచో కోడి పందాలు ఉన్నాయని, కత్తులు కూడా కట్టే వారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

జల్లికట్టుని నివారించాలంటే చాలా ఇబ్బందులు తలెత్తాయన్నారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మన పండుగను మనం ఘనంగా జరుపుకోవాలని ఈసారి అంతా బాధ్యత తీసుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివచ్చారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Also Read : సైఫ్ అలీఖాన్ రాజవంశం అని తెలుసా? అతని ఆస్తులు ఎన్ని కోట్లు..?