Tirumala : తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Tirumala : తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వారానికి 4 సార్లు సిఫార్సు లేఖలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు తిరుమల దర్శనంపై చర్చించారు. ఈ క్రమంలోనే వారంలో రెండు సార్లు వీఐపీ దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ కు సూచించారు. అలాగే వారంలో రెండుసార్లు సిఫార్సు లేఖలపై 300 రూపాయల దర్శనం కల్పించాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరుతూ ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆ అంశంపై చర్చించారు. ఏ విధంగా అమలు చేయాలి అనేదానిపై ముఖ్యమంత్రితో డిస్కస్ చేశారాయన.
వారానికి రెండు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇవ్వాలని, అలాగే 300 రూపాయల టికెట్లు కూడా రెండు రోజులు ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : జగన్ టార్గెట్‌గా పవన్ దూకుడు.. రాయలసీమపైనే ఫోకస్..! రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నారా?