CM Chandrababu Naidu: కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇలా..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30గంటలకు కడపకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12గంటలకు కడప జిల్లా మైదుకూరుకు చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మైదకూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 6గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. రాత్రి 7గంటలకు ఉండవల్లి నివాసంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విందు ఇవ్వనున్నారు. చంద్రబాబు ఇచ్చే విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు పలువురు కూటమి నేతలు పాల్గోనున్నారు.
Also Read: Polavaram Project : ముహూర్తం ఫిక్స్.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలక పరిణామం
శనివారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 11.50 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు మైదుకూరులో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు కేఎస్సీ కల్యాణ మండపానికి చేరుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కార్యకర్తల సమావేశం ఉంటుంది. ఆ తరువాత ప్రొద్దుటూరు రోడ్డులోని ఓ ఇంటి వద్దకు చేరుకొని ఇంటింటికి చెత్త సేకరణ, తడి, పొడి, ఇతర వ్యర్థాల నిర్వహణపై చంద్రబాబు అడిగి తెలుసుకుంటారు.
Also Read: AP Liquor Sales : సంక్రాంతికి ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..
రాయల కూడలి నుంచి సభావేదిక ఏర్పాటు చేసిన ప్రాంతం వరకు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర నినాదంతో ర్యాలీలో చంద్రబాబు పాల్గొంటారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక ప్రజలు, స్థానిక ప్రతినిధులతో కలిసి స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకొని సాయంత్రం 4.40 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.50 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6గంటలకు ఉండవల్లి నివాసంకు చేరుకుంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇవాళ మైదుకూరు పట్ణణంలో వాహనాలను దారి మళ్లింపునకు పోలీస్ అధికారులు నిర్ణయించారు. బద్వేలు, పోరుమామిళ్ల వైపునకు వెళ్లే వాహనదారులు ఖాజీపేటలోని నాగసానిపల్లె మీదుగా రాకపోకలు సాగించాలని సీఐ తెలిపారు. ప్రొద్దుటూరు, కడప, కర్నూలు వైపునకు వెళ్లే వాహనాలు పట్టణంలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారిమీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు.