Cm Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పని చేయాలి- స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మించడమే నా లక్ష్యం అని చంద్రబాబు అన్నారు.

Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ సారధ్యంతో భారత్ నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. మరో రెండేళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ మారుతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా అందరూ పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మించడమే నా లక్ష్యం అని చంద్రబాబు అన్నారు. పీ-4 ఫార్ములాతో పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అని ఆయన అన్నారు.
”175 నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. అలాగే రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అమలు చేస్తున్నాం. డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా పెరిగింది. వాట్సాప్ గవర్నెన్స్ తో ఆన్ లైన్ సేవలు అందుతున్నాయి. 2 నెలల్లో అన్ని సర్వీసులు వాట్సాప్ లో ఉంటాయి. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జ్, టూల్స్ అన్నీ
రెడీగా ఉంటాయి. ఆదాయం పెరగాలి. ఆరోగ్యం, ఆనందం ఉండాలి.
26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్, విజన్ డాక్యుమెంట్ తయారైంది. 26 జిల్లాల్లో మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయం తక్కువ ఉద్యానవన పంటలు ఎక్కువ ఉంటాయి. కొన్ని జిల్లాల్లో ఆక్వా, డైరీ.. ఇలా అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో అనుకూలమైన సర్వీస్ సెక్టార్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. హాస్పిటల్, టూరిజం.. ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: అందుకే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేశారు: జగన్ సంచలన కామెంట్స్