Cm Chandrababu : ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చాం- సీఎం చంద్రబాబు

మీరు స్వేచ్చగా వచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం ఎన్డీయే ప్రభుత్వం మీకు ఇచ్చింది అని తెలియజేసుకుంటున్నా.

Cm Chandrababu : ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చాం- సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu

Updated On : December 21, 2024 / 12:41 AM IST

Cm Chandrababu : పేదల భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఇతరుల భూములను కబ్జా చేయకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఏ నాయకుడు చేయని విధ్వంసాన్ని గత ప్రభుత్వంలో జగన్ చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల భూపత్రాలపై తన బొమ్మను వేసుకున్న వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

”గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఆనాటి ముఖ్యమంత్రి గుమాస్తాలను పెట్టుకుని ప్రజల భూముల మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. భయం భయంగా బతికారు. మీ భూమిని వేరే వాళ్లు కబ్జా చేసినా, మీ భూమిని 22 ఏలో పెట్టినా, మీ భూమి మీది కాదని చెప్పినా.. మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది.

మీరు స్వేచ్చగా వచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం ఎన్డీయే ప్రభుత్వం మీకు ఇచ్చింది అని తెలియజేసుకుంటున్నా. 2024 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను చాలా పటిష్టంగా తీసుకొచ్చాం. ఎవరైనా వేరే వాళ్ల భూమిని కొట్టేసి, కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం. భూ ఆక్రమణ చేసినా, బలవంతంగా లాక్కున్నా, బెదిరించి లాగేసుకున్నా, మోసం చేసి లాగేసుకున్నా కొత్త చట్టం వర్తిస్తుంది. ఆరు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు జైల్లో పెట్టే అధికారం ఇచ్చాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

 

Also Read : ఒకరు మాజీ మంత్రి, మరొకరు సీనియర్ మంత్రికి స్వయాన మేనల్లుడు.. భీమిలి వైసీపీ ఇంఛార్జ్ పోస్టు ఎవరికి?