CM Chandrababu: జగన్ మావిగన్ వ్యాఖ్యలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుంది- సీఎం చంద్రబాబు
రాజధానిలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఎకరం ధర ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 కోట్ల విలువ వేసుకున్నా 50వేల కోట్లు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.
Cm Chandrababu Slams Ys Jagan On His Mavigun Comments
Cm Chandrababu: మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి త్వరలో సరైన సమాధానం ఇస్తుందన్నారు. అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్ కు పూర్తి స్తాయి కౌంటర్ ఇస్తుందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందంటే దానికి కారణం హైదరాబాద్ వల్లే అని చెప్పుకొచ్చారు. రాజధానిలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఎకరం ధర ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 కోట్ల విలువ వేసుకున్నా 50వేల కోట్లు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఇలాంటి విషయాలు తెలియక అవతలి వారు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు చంద్రబాబు.
హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్, ఐటీ.. ఆదాయాన్ని పెంచాయని చంద్రబాబు గుర్తు చేశారు. సైబరాబాద్ వల్లే నేటికీ హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీ రాజధాని అమరావతి కూడా ఇదే తరహాలో అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read: మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?
