కొన్ని గంటల క్రితమే పార్టీలో చేరిక.. ఇంతలోనే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక.. బీజేపీ మాజీ ఎంపీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్

2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

కొన్ని గంటల క్రితమే పార్టీలో చేరిక.. ఇంతలోనే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక.. బీజేపీ మాజీ ఎంపీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్

Hindupuram YCP Incharge Shantha

Updated On : January 3, 2024 / 10:42 AM IST

J Shantha : ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ వైసీపీలో మార్పుల చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గ ఇంఛార్జ్ లను మార్చేస్తున్నారు జగన్. ఇంఛార్జిల మార్పునకు సంబంధించి తాజాగా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది వైసీపీ అధినాయకత్వం. 27మంది ఇంఛార్జిలతో రెండో జాబితా వచ్చేసింది. ఈ లిస్టులో ఓ ఆసక్తికర అంశం ఉంది. కొన్ని గంటల క్రితమే వైసీపీలో చేరిన మహిళకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఆమెను ప్రకటించేశారు.

ఆ ఛాన్స్ పొందిన మహిళ పేరు జే శాంత. ఈమె మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు. మంగళవారమే వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మాజీ ఎంపీ జే శాంత వాల్మీకి సామాజికి వర్గానికి చెందిన వారు. 2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Also Read : గోరంట్ల మాధవ్‌కు నిరాశ..! హిందూపురం ఇంఛార్జ్‌గా మహిళకు సీఎం జగన్ అవకాశం

వైసీపీలో ఇలా చేరారో లేదో అలా బంపర్ ఆఫర్ ఆమెను వరించింది. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్ సభ స్థానానికి ఇంచార్జ్ గా శాంతను నియమించారు జగన్. వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా శాంత పోటీ చేయనున్నారు.

ఏపీలో సీఎం జగన్‌ చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో చేరానని శాంత తెలిపారు. వైసీపీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. వాల్మీకి వర్గానికి సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారన్న శాంత.. అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఆమె అలా అన్నారో లేదో.. ఇలా ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చేశారు జగన్.

Also Read : 8 మంది సిట్టింగ్‌లకు జగన్ షాక్, 11 మంది కొత్తవాళ్లకు, ఐదుగురు వారసులకు అవకాశం.. వైసీసీ సెకండ్ లిస్ట్ విడుదల

27 మంది ఇంఛార్జిలతో వైసీపీ సెకండ్ లిస్ట్..

అనంతపురం ఎంపీ – శంకరనారాయణ
హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
అరకు ఎంపీ (ఎస్టీ) – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

రాజాం ఎస్సీ – తాలె రాజేశ్
అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
పాయకరావు పేట (ఎస్సీ) – కంబాల జోగులు
రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాశ్
పి.గన్నవరం (ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం – వంగ గీత
జగ్గంపేట – తోట నరసింహం
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి – మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (ఎస్సీ) – తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూర్ – మాచాని వెంకటేశ్
తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ – ఉషా శ్రీ చరణ్
కల్యాణదుర్గం – తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్