CM Jagan : 2లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం, పేదలకు భూములిచ్చాం.. మరి చంద్రబాబు ఏమిచ్చారు?- సీఎం జగన్
CM Jagan Slams Chandrababu : చంద్రబాబు హయాంలో అత్తగారి సొత్తు అన్నట్లుగా అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను పేదవారికి ఇచ్చే గొప్ప మార్పు, గొప్ప అడుగు పడింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే..

CM Jagan Slams Chandrababu (Photo : Google)
ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. చంద్రబాబు టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. ఛాన్స్ చిక్కితే చాలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారు? అని పదే పదే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు సీఎం జగన్.
చంద్రబాబుపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు సీఎం జగన్. మంచి చేసి చంద్రబాబు సీఎం అవ్వలేదన్నారు. ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనే బాబుకి లేదన్నారు. వైపీపీ పాలనలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగిందన్నారు.
Also Read : రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కంటే .. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉంది : అచ్చెన్నాయుడు
”చంద్రబాబు హయాంలో అత్తగారి సొత్తు అన్నట్లుగా అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను పేదవారికి ఇచ్చే గొప్ప మార్పు, గొప్ప అడుగు పడింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి సీఎం కుర్చీలో కూర్చోలేదు. తాను తీసుకొచ్చిన మంచి స్కీమ్ ల వల్లనో, లేక తాను చేసిన మంచి పనుల వల్లనో ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు.
దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా కేవలం ఈ 53 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు అక్షరాల 2లక్షలు 7వేలు. రాబోయే రోజుల్లో అబద్దాలు ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో మోసాలు ఎక్కువ అవుతాయి. గజదొంగ చంద్రబాబు, ఆయనకు తోడు గజదొంగల ముఠా, ఆ గజ దొంగల ముఠాకు తోడు దత్తపుత్రుడు. వీళ్లంతా ఏకమవుతారు. మీ బిడ్డ మాత్రం ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోడు. మీ బిడ్డ పొత్తు కేవలం మీతోనే(ప్రజలతోనే) ఉంటుంది. తోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది” అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
Also Read : ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు