CM Jagan Kadapa Tour : సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్ ఖరారు

ఏపీ సీఎం జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రెడీ అయింది. 23వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం నుంచి కడప జిల్లా పర్యటనకు బయలుదేరుతారు.

CM Jagan Kadapa Tour : సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్ ఖరారు

Cm Jagan Kadapa Tour

Updated On : December 22, 2021 / 12:01 PM IST

CM Jagan Kadapa Tour : ఏపీ సీఎం జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రెడీ అయింది. 23వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం నుంచి కడప జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్, 23 సాయంత్రం ఇడుపుల పాయ ఎస్టేట్‌కు చేరుకొని అక్కడే బస చేస్తారు.

చదవండి : CM Jagan : పేదల కోసమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం : సీఎం జగన్

24వ తేదీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు.. అనంతరం ఆదిత్యబిర్లా యూనిట్‌కు జగన్ శంకుస్థాపన చేస్తారు. ఇక 25 తేదీ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు జగన్.. అదే రోజు తాడేపల్లికి తిరిగి రానున్నారు. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

చదవండి : CM Jagan : నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన..జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం