CM Jagan : విశాఖకు సీఎం జగన్.. శారదా పీఠం వార్షిక మహోత్సవం
ప్రతీ ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి

Ys Jagan Mohan Reddy
CM Jagan : ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్టణానికి వెళ్లనున్నారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11 గంటలకు వైజాగ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకుంటారు. ఒంటిగంట వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు.
Read More : Coronavirus Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. వెయ్యికి పైగా మరణాలు
ప్రతీ ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు అంకుర్పారణ చేశారు. తర్వాత గణపతిపూజ, పుణ్యహవచనం, అగ్నిమధనం, రాజశ్యామల యాగం, నిత్యపీటపూజ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చారు. పీఠం వార్షికోత్సవాలు సందర్భంగా అనేక ఆధ్మాతిక కార్యక్రమాలు, సాంస్కృతిక విభావరి, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.