CM Jagan : మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్, అంబులెన్స్‌కు దారి
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వండి అని మాటల్లో చెప్పడమే కాదు ఆచరణలోనూ చూపించారు.

Cm Jagan
CM Jagan : ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వండి అని మాటల్లో చెప్పడమే కాదు ఆచరణలోనూ చూపించారు. 108 అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ని పక్కకి జరిపించారు సీఎం జగన్. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి వెళుతుండగా ఎనికేపాడు దగ్గర ఈ ఘటన జరిగింది.
CM Jagan : సీఎం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. జగన్ ఏం చేశారంటే..
రోడ్డు మీద 108 అంబులెన్స్ ను చూడగానే స్పందించిన సీఎం జగన్ తన కాన్వాయ్‌ని ఆపించారు. రోడ్డు పక్కన ఆపించారు. అంబులెన్స్ వెళ్లేందుకు దారిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికి అంబులెన్స్ ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా జగన్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి వెళ్తున్న క్రమంలో.. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుపతిలోని తాజ్ హోటల్ కు వెళుతుండగా, ఓ మహిళ చేతిలో పత్రాలతో సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. దీన్ని జగన్ గమనించారు.
Instant Covid Test : కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!
వెంటనే ఆయన కాన్వాయ్ ఆపించి ఆ మహిళ సమస్య ఏంటో తెలుసుకోవాలని తన ఓఎస్డీ ధనుంజయరెడ్డిని పంపించారు. సీఎం ఆదేశాలతో ఓఎస్‌డీ ధనుంజయరెడ్డి వెళ్లి బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దటీజ్ సీఎం జగన్ అని నెటిజన్లు ప్రశంసించారు.