CM Jagan : 21 రోజుల్లోనే అర్హతను నిర్ధారించాలి, సీఎం జగన్ కీలక ఆదేశం

సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హత నిర్దారణ సమయానికి సంబంధించి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల్లోనే ని

CM Jagan : 21 రోజుల్లోనే అర్హతను నిర్ధారించాలి, సీఎం జగన్ కీలక ఆదేశం

Cm Jagan

Updated On : August 25, 2021 / 8:43 PM IST

CM Jagan : సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హత నిర్దారణ సమయానికి సంబంధించి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల్లోనే నిర్ధారించాలని ఆదేశించారు. పెన్షన్, ఆరోగ్యశ్రీ, రైస్‌కార్డు దరఖాస్తుదారుల అర్హతను 21 రోజుల్లో గుర్తించి.. అర్హత పొందిన వారికి 90 రోజుల్లోగా వాటిని మంజూరు చేయాలని తేల్చి చెప్పారు. ఏడాదికి 4 సార్లు ఇలా శాంక్షన్లు వస్తాయని వెల్లడించారు. పథకాల అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరక్కూడదని జగన్ స్పష్టం చేశారు.

‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇళ్ల పట్టాలతోపాటు, నేతన్న నేస్తం, చేయూత, మత్స్య భరోసా తదితర పథకాలను అమలు చేస్తోంది. పథకాన్ని అమలు చేసినప్పుడు ఎవరైనా మిగిలిపోతే వారిని దరఖాస్తు చేసుకోమని చెబుతున్నాం. ఈ జాబితాల్లో కూడా 90 రోజుల్లోగా అర్హతలను నిర్ధారించి, అర్హులైన వారికి 6 నెలల్లోగా శాంక్షన్లు ఇవ్వాలి. దీని వల్ల ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం కలుగుతుంది. ఏడాదికి ఇలా 2 సార్లు శాంక్షన్లు వస్తాయి’ అని జగన్ చెప్పారు.

అధికారుల తనిఖీల్లో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. సిటిజన్‌ ఔట్ రీచ్‌ కార్యక్రమంపైనా అధికారులు తనిఖీల్లో పర్యవేక్షణ చేయాలి. సచివాలయాల పరిధిలో పథకాల పట్ల అవగాహన కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. పథకం అమలుకు ఒకరోజు ముందు ఈ సమావేశం జరగాలి. లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు చేరిన తర్వాత వాలంటీర్‌తో కలిసి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లబ్ధిదారుని దగ్గరకెళ్లి డిజిటల్‌ అక్నాలెడ్జ్‌తోమెంట్‌తోపాటు, భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలి అని జగన్ చెప్పారు.

నెలలో చివరి శుక్రవారం, శనివారం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో ఒక్కొక్కరు, ఇద్దరు ముగ్గురు వాలంటీర్లతో కలిపి బృదంగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలి. వాటిపట్ల అవగాహన కల్పించాలి. పౌరులనుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఫోన్‌నంబర్లను వారికి ఇవ్వాలి. కరపత్రాలను వారికి ఇవ్వాలి. హౌసింగ్‌ లే అవుట్లలో ప్లాట్ల మ్యాపింగ్‌ వచ్చే 10 రోజుల్లోగా పూర్తిచేయాలి.

అర్హులైన వారికి మిగిలిన ప్లాట్లను వెంటనే కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులుగా గుర్తించిన వారికీ ఇంటి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్ లో ఉన్న సుమారు 8వేల దరఖాస్తులకు వెంటనే వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. అర్హులుగా గుర్తించిన 1,99,663 లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో 45,212 మందికి పట్టాలు. కొత్తగా లే అవుట్లలో 10,801 మందికి పట్టాలు. మరో 1,43,650 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని జగన్ చెప్పారు.

ఇక కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ సూచించారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం సీఎం జగన్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్‌ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.