YS Jagan Bus yatra : ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర.. భీమవరంలో బహిరంగ సభ

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర మంగళవారంకు 16వ రోజుకు చేరుకుంది.

YS Jagan Bus yatra : ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర.. భీమవరంలో బహిరంగ సభ

CM Jagan

YS Jagan : వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారంకు 16వ రోజుకు చేరుకుంది. సోమవారం బస్సు యాత్ర అనంతరం నారాయణపురం దగ్గర సీఎం జగన్ మోహన్ రెడ్డి బస చేశారు. మంగళవారం ఉదయం 9గంటలకు నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నారాయణపురం, నిడమర్రు, గణపవరం, ఉండికి బస్సుయాత్ర చేరుతుంది. ఉండి శివారులో సీఎం జగన్ మోహన్ రెడ్డి భోజన విరామం తీసుకుంటారు. అనంతరం యాత్ర భీమవరం చేరుకుంటుంది. భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద సాయంత్రం 3.30 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.

Also Raed : CP Kanthi Rana Tata : సీఎం జగన్ లక్ష్యంగా దాడి జరిగింది, అక్కడ తగిలి ఉంటే ప్రాణాపాయంగా మారేది- సీపీ కీలక వ్యాఖ్యలు

భీమవరంలో సభ అనంతరం బస్సు యాత్ర గరగపర్రు మీదుగా పిప్పర, చిలకంపాడు లాకులు, రావిపాడు, దువ్వ, తణుకు క్రాస్, పెరవలి, సిద్దాంతం క్రాస్ రోడ్డు మీదుగా ఈత కోట వద్దకు చేరుకుంటుంది. ఈతకోటలో ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వద్దకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకొని మంగళవారం రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు 103 కిలో మీటర్ల మేర బస్సు యాత్ర సాగనుంది. జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. మరోవైపు భీమవరంలో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి రెండు లక్షల మందికిపైగా ప్రజలు హాజరవుతారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Also Read : CM Jagan : సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో విచారణ వేగవంతం.. మరో 16టీంలు ఏర్పాటు

ఇదిలాఉంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి సోమవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. భీమవరంలో బహిరంగ సభ అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర ఉంగుటూరు నియోజకవర్గంలోని చిలకంపాడు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కాశీపాడు మీదుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని రావిపాడు వరకు సాగుతుంది. అక్కడ తణుకు నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది.