జగనన్న వసతి దీవెన : పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : February 24, 2020 / 11:18 AM IST
జగనన్న వసతి దీవెన : పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే – సీఎం జగన్

Updated On : February 24, 2020 / 11:18 AM IST

ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా సరే…అందరికీ అందించే విధంగా ఈ పథకం (జగనన్న వసతి దీవెన) ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. మంచి చదువులు చెప్పించడంతో పాటు..చదువుకొనే పరిస్థితులను కల్పించడం వసతి దీవెన పథకం యొక్క ఉద్దేశ్యమన్నారు. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలలో మొదటి వాయిదా కింద..రూ. 10 వేలు, జులై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో రూ. 10 వేల రూపాయలు తల్లులకు అందిస్తామన్నారు. ఐటీఐ చదివే విద్యార్థులకు రెండు విడతులగా రూ. 10 వేలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు రెండు విడతులుగా రూ. 15 వేలు, ఈ సొమ్మును చదివించే తల్లికి మాత్రమే అందుతుందన్నారు. 

2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా..నిరుపేదలు, అణిచివేయబడిన వర్గాల తలరాతలు మారలేదని, వారి కుటుంబాల్లో చదువుల దీపాలను వెలిగిస్తేనే..ఈ తరంతో పాటు..రాబోయే తరాలకు వారి తలరాతలు మారుతాయన్నారు. ప్రతి పేదవాడి కుటుంబంలో ఉన్న ఓ వ్యక్తి..అప్పుల పాలు కాకుండా..ఓ ఇంజినీర్, డాక్టర్, ఉన్నత చదువులు చదివి..మంచి ఉద్యోగాలు రావాలన్నారు.

సంపాదించిన డబ్బులో కొంత..ఆ కుటుంబానికి పంపించే పరిస్థితి రావాలన్నారు. అయితే..ఇప్పటి వరకు రాలేదని, చదువు రాని వారు 33 శాతం ఉన్నారని వెల్లడించారు. 
ఇంటర్ మీడియట్ అయిపోయిన తర్వాత..కాలేజీల్లో చేరే వారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే..దేశంలో 23 శాతం మాత్రమే ఉందన్నారు. అంటే..మిగతా వారు చదువులు మానేస్తున్నారని చెప్పారు. ఇలా ఉంటే..పేదరికం నుంచి బయట ఎలా పడుతుందని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా..చదువుల విప్లవానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇచ్చిన హామీ ప్రకారం…వసతి దీవెన పథకానికి ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 

* సంవత్సరానికి రెండున్నర లక్షలకన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ప్రతి ఏటా రూ. 20 వేల రూపాయల సహాయం ఇస్తామని ప్రకటించారు. 
* 11 లక్షల 87 వేల మంది విద్యార్థులకు 11 వందల కోట్లకు పైగా 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం తల్లుల అకౌంట్లలలో పడుతాయన్నారు. 
* వసతి దీవెన పథకం కింద రూ. 2 వేల 300 కోట్లు, విద్యా దీవెనకు (పూర్తి రీయింబర్స్ మెంట్) సంవత్సరానికి రూ. 3 వేల 700 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 
 

* మొత్తం 6 వేల కోట్ల రూపాయలు చదువుకొనే విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామన్నారు. 
* అమ్మ ఒడి పథకానికి రూ. 6 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మూడు పథకాలకు రూ. 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 
* ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి (నాడు నేడు), రూ. 45 వేల పాఠశాలలు, 471 ప్రభుత్వ కాలేజీలు, 3 వేల 287 ప్రభుత్వ హాస్టళ్లు, 148 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల (మూడు సంవత్సరాల్లో) రూపురేఖలు మారుతాయన్నారు. 
* మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పు (గోరు ముద్ద)లో మార్పులు చేస్తున్నామన్నారు. 

* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టబోతున్నామన్నారు. 
* నాలుగు సంవత్సరాల్లో బోర్డు ఎగ్జామ్..ఇంగ్లీషులోనే రాసే పరిస్థితి తీసుకొస్తామన్నారు సీఎం జగన్. 

Read More : ఆశీర్వదించండి : రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం – సీఎం జగన్