Guntur Jawan : అమర జవాన్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం

జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా జవాన్‌ కుటుంబానికి.. ఏపీ సర్కార్‌ ఆర్థిక సాయం ప్రకటించింది. అమర జవాన్‌కు నివాళులర్పించిన సీఎం.. ఉగ్రవాదులపై పోరులో భాగంగా.. కశ్మీర్‌లో ప్రాణత్యాగంచేసిన జశ్వంత్‌ చిరస్మరణీయుడని కొనియాడారు. దేశ రక్షణలో భాగంగా.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారని.. జశ్వంత్‌ రెడ్డి త్యాగం నిరుపమాణమన్నారు సీఎం జగన్‌.

Guntur Jawan : అమర జవాన్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం

Guntur Jawan

Updated On : July 9, 2021 / 2:41 PM IST

CM Jagan Pays Tribute : జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా జవాన్‌ కుటుంబానికి.. ఏపీ సర్కార్‌ ఆర్థిక సాయం ప్రకటించింది. అమర జవాన్‌కు నివాళులర్పించిన సీఎం.. ఉగ్రవాదులపై పోరులో భాగంగా.. కశ్మీర్‌లో ప్రాణత్యాగంచేసిన జశ్వంత్‌ చిరస్మరణీయుడని కొనియాడారు. దేశ రక్షణలో భాగంగా.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారని.. జశ్వంత్‌ రెడ్డి త్యాగం నిరుపమాణమన్నారు సీఎం జగన్‌.

Read More : Corona Third Wave : తెలంగాణలో థర్డ్‌వేవ్‌.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డీహెచ్‌

2021, జూలై 08వ తేదీ గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుంటూరు జిల్లా వాసి జశ్వంత్ రెడ్డి అమరుడయ్యారు. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్‌రెడ్డి.. ఐదేళ్ల క్రితం భారత సైన్యంలో చేరారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Read More : Antarctica India Scientist : అంటార్కిటికాలో కొత్త జాతి మొక్క

గత కొంతకాలంగా ఉగ్రవాదులు భారత భూ భాగంలోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో…ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో జవాన్లు వీరమరణం పొందుతున్నారు. రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో గురువారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి అసువులుబాసారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన మరుపోలు జశ్వంత్‌ రెడ్డి కూడా ఉన్నారు. చిన్నవయస్సులోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 23 ఏండ్ల జశ్వంత్‌ రెడ్డి భారత సైన్యంలో చేరారు. ఐదేండ్ల క్రితం భారత సైన్యంలో చేరిన జశ్వంత్ రెడ్డి ఉగ్రవాదులకు..భారత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు.