ఏపీతో నది జలాల వివాదాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

river Irrigation dispute : ఏపీతో నదీ జలాల వివాదాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, తదితర అక్రమ ప్రాజెక్టులను ఏపీ ఆపకుంటే.. తెలంగాణ కూడా అలంపూర్ పెద్ద వరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమన్నారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించడం బాధాకరమన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్టు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇక కుదరదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోనేది లేదన్నారు. ఇప్పటికైనా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఏపీ నిలిపివేయాలని సూచించారు.