సీఎం జగన్ వరాలు : సాక్స్, యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, బెల్టు

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 09:16 AM IST
సీఎం జగన్ వరాలు : సాక్స్, యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, బెల్టు

Updated On : January 9, 2020 / 9:16 AM IST

విద్యార్థులపై సీఎం జగన్ వరాలు కురిపించారు. కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు. చదువుకోవాలనే ఉద్దేశ్యంతో తాము వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హాయాంలో ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా విద్యార్థులకు ఒక కిట్ అందచేయడం జరుగుతోందని సీఎం జగన్ ప్రకటించారు.

2020, జనవరి 09వ తేదీ గురువారం చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం బడులకు వెళ్లే సరికి..సగం సంవత్సరం అయిపోయినా కూడా పుస్తకాలు అందని పరిస్థితి గతంలో నెలకొని ఉండేదని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికి చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక కిట్ అందచేయడం జరుగుతుందని ప్రకటించారు.

కిట్ లో మూడు జతల యూనిఫాం, సాక్స్, పుస్తకాలు, బూట్లు, బెల్టు ఇవన్నీ అందచేయడం జరుగుతుందని వెల్లడించార. పాఠశాలల్లో భోజన సదుపాయాలు పెంచడంతో పాటు టీచర్లకు శిక్షణ అందచేయడం జరుగుతోందన్నారు. ఇవన్నీ చేయడం వల్ల పిల్లల తల్లుల ఆశలు నెరవేర్చడం జరుగుతోందన్నారు సీఎం జగన్. 

Read More : ఏపీలో కొత్త పథకాలు : జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన