జగన్ వస్తున్నారు.. రేపు లండన్ నుంచి ఏపీకి చేరుకోనున్న సీఎం, పార్టీ నేతలతో కీలక సమావేశం?

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.

జగన్ వస్తున్నారు.. రేపు లండన్ నుంచి ఏపీకి చేరుకోనున్న సీఎం, పార్టీ నేతలతో కీలక సమావేశం?

Updated On : May 31, 2024 / 7:29 PM IST

Cm Jagan : ఏపీ సీఎం జగన్ రేపు (జూన్ 1,2024) ఉదయం 5 గంటలకు లండన్ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లిన జగన్.. 15 రోజుల పాటు పర్యటించారు. రేపు ఉదయం నాలుగన్నర గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్.

ఎన్నికల్లో విరామం లేకుండా జోరుగా ప్రచారం నిర్వహించారు జగన్. పార్టీలో అన్నీ తానై ఎన్నికల ప్రచార పర్వాన్ని నడిపించారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. బస్సు యాత్రలతో జనంలోకి వెళ్లారు. ఇలా గ్యాప్ లేకుండా రెస్ట్ లేకుండా ఎన్నికల ప్రచారం చేశారు జగన్. మే 13న పోలింగ్ ముగిశాక జగన్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. కుటుంబంతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. మే 17న ఆయన లండన్ కు పయనం అయ్యారు. 15 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్నారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్.. ఈ మూడు దేశాల్లో ఆయన తిరిగారు.

పోలింగ్ తర్వాత కౌంటింగ్ కు గ్యాప్ దొరకడంతో జగన్ రెస్ట్ తీసుకున్నారు. ఇందుకోసం ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. జగన్ లండన్ పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి రానున్నారు. 15 రోజుల తర్వాత ఆయన లండన్ నుంచి రాష్ట్రానికి రానున్నారు. రేపు ఉదయం 5 గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకోబోతున్నారు. లండన్ నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి నాలుగన్నర గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం తర్వాత పార్టీ నేతలతో జగన్ సమావేశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

కౌంటింగ్ ఏర్పాట్ల గురించి, గత 15 రోజుల నుంచి రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి, పోస్టల్ బ్యాలెట్ వివాదం, పోలింగ్ తర్వాత అనంతపురం, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు, రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. కౌంటింగ్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అన్నదానిపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో గెలుపుపై సీఎం జగన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లండన్ పర్యటనకు వెళ్లే ముందు కూడా విజయంపై ఆయన చాలా ధీమా వ్యక్తం చేశారు. అందరి ఆశీస్సులతో మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోందని నిన్న జగన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Also Read : పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది- ఎస్పీ మలికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు