పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది- ఎస్పీ మలికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు

పల్నాడు పోలీస్ ఇమేజ్ కాపాడేందుకు ఇదే మనకు లాస్ట్ చాన్స్. అదే జరిగితే పల్నాడు పోలీసుల పేరు డ్యామేజ్ అవుతుంది. పల్నాడు పోలీసులపై నమ్మకం పోతుంది.

పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది- ఎస్పీ మలికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు

Updated On : May 31, 2024 / 6:56 PM IST

Sp Malika Garg : పోలింగ్ రోజున, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోందని ఎస్పీ మలికా గార్గ్ అన్నారు. హింసతో, చెడు ఘటనలతో పల్నాడు పేరు చెడగొట్టారని ఎస్పీ వాపోయారు. నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా వ్యాపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడులో ఇంత ఫ్యాక్షనిజం ఉందా? అని నా స్నేహితులు అడుగుతున్నారని ఎస్పీ వాపోయారు. చెడు ఘటనలతో పల్నాడు పేరు మార్మోగడం బాధాకరం అన్నారామె.

”ఇంతకుముందు పల్నాడు అంటే ఏంటో నాకు తెలియదు. ఇండియా లెవల్ లో పల్నాడు గురించి ఎవరికీ తెలియదు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి గురించి అందరికీ తెలుసు. పల్నాడు గురించి ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు పల్నాడు మొత్తం ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అయితే మంచి కారణంతో కాదు బ్యాడ్ రీజన్ తో. గుడ్ రీజన్ తో పల్నాడు ఫేమస్ అయ్యుంటే చాలా సంతోషం కలిగేది. నరసరావుపేట, మాచర్లలో ఇంత జరిగింది.. అందరికీ తెలుసు నరసరావుపేట, మాచర్ల అంటే ఏంటి? హింసాత్మక ఘటనలకు ముందు పల్నాడు, నరసరావుపేట, మాచర్ల గురించి ఎవరికీ తెలియదు. ఇలాంటి గుర్తింపు రావడం ఏమైనా బాగుందా? బాగోలేదు కదా.

జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు అందరి చూపు పల్నాడుపైనే ఉంది. ఈసీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కౌంటింగ్ రోజున పల్నాడులో మళ్లీ ఏమైనా హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరుగుతాయా? అని అంతా అనుకుంటున్నారు.

అదే జరిగితే పల్నాడు పోలీసుల పేరు డ్యామేజ్ అవుతుంది. పల్నాడు పోలీసులపై నమ్మకం పోతుంది. పల్నాడు పోలీస్ ఇమేజ్ కాపాడేందుకు ఇదే మనకు లాస్ట్ చాన్స్. పల్నాడు పోలీసు అధికారులు అంతా బాగా పని చేస్తారు. చాలా ఎక్స్ లెంట్, ఫిట్ గా ఉన్నారు, డెడికేషన్ గా ఉన్నారు. ఓన్లీ మీకు డైరెక్షన్ మాత్రమే కావాలి. ఒక లీడర్ షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ ప్రాపర్ గా ఇస్తే పల్నాడు పోలీసులు ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు మన సత్తా ఏంటో చూపించే టైమ్ వచ్చింది” అని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.

Also Read : ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు? టేబుల్స్ ఎందుకు? రౌండ్స్ అంటే? కౌంటింగ్ ప్రక్రియపై 10టీవీ ఎక్స్‌క్లూజివ్