Vijayawada Durga Temple: విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..
విజయవాడ కనకదుర్గ గుడి వద్ద పెనుప్రమాదం తప్పింది. దుర్గగుడి కేశఖండనశాల పక్కన ఉన్న కొండ చర్యలు విరిగిపడ్డాయి.

Vijayawada Durga Temple
Vijayawada Kanakadurga Temple: విజయవాడ కనకదుర్గ గుడి వద్ద పెను ప్రమాదం తప్పింది. దుర్గగుడి కేశఖండనశాల పక్కన ఉన్న కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి రోడ్డుపై పడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పార్కింగ్ చేసిన బైక్‌లు ధ్వంసం అయ్యాయి. అయితే, బైకులు ధ్వంసం అయినట్లు కనిపిస్తుండటంతో కొండచరియల కింద ఎవరైన పాదాచారులు ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
విజయవాడలో రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కొండచరియనాని ఉండటంతో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. దుర్గగుడి కొండచరియలు విరిగిపడిన దాఖలాలు గతంలో లేవని స్థానికులు చెబుతున్నారు. తాజాగా కేశఖండనశాల పక్కన భారీగా కొండచరియలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై విరిగి పడిన కొండచరియలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే చర్యలు చేపట్టారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోకలు తక్కువగా ఉన్నాయి. దీంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.
YCP MP Vijayasai Reddy: చంద్రబాబు రాజకీయ జీవితం 2023 వరకేనా? ఎలా అంటే.. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
దుర్గగుడి ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఎవరూలేరని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సోమవారం కావడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉందని, దీనికితోడు కొండచరియలు విరిగిపడిన ప్రాంతం భక్తులు నిలబడే ప్రదేశం కాదని, అందుకే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని చెప్పారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషన్‌కు సమాచారం అందించామని, డ్రోజర్ పంపిస్తామని చెప్పారని, వెంటనే రోడ్డుపై పడిన కొండచరియలను తొలగించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని దుర్గ గుడి ఈవో చెప్పారు.