తనను క్రిస్టియన్ అన్న ప్రచారం..సంచయిత సమాధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. సంచయిత మతంపైనా విమర్శలొస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. సంచయిత మతంపైనా విమర్శలొస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. సంచయిత నియామకం ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధమని.. జగన్ సర్కార్ తీరును తప్పుబడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో కూడా సంచయిత ఎపిసోడ్‌పై విమర్శలతో పాటూ ట్రోల్స్ మొదలయ్యాయి.
సంచయిత మతంపైనా విమర్శలు
సంచయిత ఎపిసోడ్‌లో ప్రధానంగా ఆమె మతంపైనా విమర్శలొస్తున్నాయి. ఆమె హిందూ సంప్రదాయాలను పాటించరని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమెకు సింహాచలం ఆలయ ట్రస్ట్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. సంచయిత ఏనాడూ విజయనగరం వెళ్లలేదని.. ట్రస్ట్ వ్యవహారాలను ఎప్పుడూ పట్టించుకోలేదు అంటున్నారు. అలాంటి ఆమెకు కీలమైన సింహాచలం ట్రస్ట్ బాధ్యతలు ఎలా ఇచ్చారని విమర్శిస్తున్నారు.
శర్మ ఎలా క్రిస్టియన్ అవుతారు?
సంచయిత గజపతిరాజు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టాపిక్‌లో స్వయంగా సంచయిత కామెంట్ చేయడంతో జనం రెచ్చిపోయారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వి ప్రసాద్ అనే క్యాన్సర్ రీసెర్చర్… ఈ టాపిక్‌పై కామెంట్ చేస్తూ… తల్లి క్రిస్టయన్‌ను పెళ్ళి చేసుకున్న తరవాత… సంచయిత క్రిస్టియన్ పద్ధతుల్లోనే పెరిగిందని… ఈ విషయమై ఆమెనే స్పందిచాలని అన్నారు. దీనికి సంచయిత బదులిస్తూ… శర్మ ఎలా క్రిస్టియన్ అవుతారు? అంటూ ప్రశ్నించింది.
మాన్సాస్ చైర్‌పర్సన్‌గా సంచయిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
సంచయిత క్రిస్టియనా?
శనివారం (మార్చి 7, 2020) ఉదయం మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నేత అశోకగజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ అన్యమతస్థులను బోర్డు ఛైర్మన్‌గా నియమించడమేమిటని ప్రశ్నించారు. పరోక్షంగా సంచయిత హిందువు కాదనే అర్థంలో ఆయన మాట్లాడారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే… ఆమె క్రిస్టయన్ అనే అర్థం చెప్పకనే వస్తోంది. ఎందుకంటే అశోక్‌గజపతి మీడియా సమావేశానికి ముందే…అంటే నిన్ననే శుక్రవారం (మార్చి 6, 2020) సోషల్ మీడియాలో సంచయిత క్రిస్టియన్ విశ్వాసాలను బలంగా నమ్మే మహిళ అంటూ కొన్ని కథనాలు వచ్చాయి. అందులో 2017లో సంచయిత తన తల్లి ఉమా గజపతిరాజుతో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అందులో ఆమె వాటికన్‌లో సందర్శించిన ఫొటోలు ఉన్నాయి. ఒక వెబ్‌సైట్‌లో ఆమె ఒక ట్వీట్‌లో ఇలా రాసినట్లు కూడా పేర్కొన్నారు.
“On the solemn day of #GoodFriday let us remember the ultimate sacrifice of Christ The Redeemer and Pledge to Spread love and Compassion”.
విచిత్రమేమిటంటే సంచయిత 2013లో ట్విటర్‌లో జాయిన్ అయ్యారు. కాని ఆమె ఖాతాలో ఇప్పు డు 2019 అక్టోబర్ 3వ తేదీ నుంచి ఉన్న ట్వీట్లే కన్పిస్తున్నాయి. అంటే పాతవి డిలీట్ చేసేశారన్నమాట. బీజేపీకి మద్దతుగా ఉన్న కొన్ని వెబ్‌సైట్స్ ఆమె గతాన్ని తవ్వి పాత ట్విట్లను బయటకు తెచ్చాయి. అందులో భాగంగానే ఆమె పాత ఫొటోలు, పాత కామెంట్లు ఇప్పుడు బయటపడుతున్నాయి. సాధారణంగా విజయనగర రాజులు ఎలా ఉంటారని ప్రశ్నిస్తే… ఠక్కున అశోక్ గజపతిరాజు గుర్తొస్తారు. ఆయన సాదాసీదా జీవన విధానం రాష్ట్రంలోనే కాదు… దేశ వ్యాప్తంగా తెలుసు. ఒక్కసారిగా సంయిత, ఆమె పాత ట్వీట్లు, ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో బయటపడేసరికి అశోక్‌గజపతిరాజు విషయంలో తప్పు జరిగిందేమో అన్న భావన ప్రజల్లో మొదలైంది.
వాటికన్‌కు వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్‌ను అవుతానా?
మరోవైపు వాటికన్‌కు వెళ్ళినంత మాత్రాన తాను క్రిస్టియన్‌ను అవుతానా అని సంచయిత టీవీ ఛానల్స్‌తో అన్నారు. బాబాయ్ అలా అనడం తనను బాధ పెడుతోందని, ఆయన ఎపుడూ మసీదులకు, చర్చిలకు వెళ్ళలేదా అని ప్రశ్నించింది. కాని సోషల్ మీడియాలో సంచయితకు వ్యతిరేక కామెంట్లే వస్తున్నాయి. పాత ట్వీట్లు ఆమెకు ఇప్పుడు పెద్ద మైనస్‌గా మారాయి. మసీదుకు వెళ్ళడానికి మక్కా వెళ్ళడానికి ఎంత వ్యత్యాసం ఉందో… చర్చికి వెళ్ళడానికి వాటికన్‌కు వెళ్ళడానికి అంతే తేడా ఉందని జనం బహిరంగంగానే కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి విజయనగర రాజుల వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది.