Narayana Swamy : జగన్‌పై కుట్ర జరుగుతోంది, చంపేందుకు చందాలు..? డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

జగన్ పై కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి టీడీపీ చంద్రబాబు హాని తలపెడతారని రోజూ భయపడుతున్నామని అన్నారు. కొడాలి నాని, అంబటి, వంశీ..

Narayana Swamy : జగన్‌పై కుట్ర జరుగుతోంది, చంపేందుకు చందాలు..? డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Narayana Swamy

Updated On : December 12, 2021 / 4:36 PM IST

Narayana Swamy : ఏపీ సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోందని అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను హత్య చేసి అయినా.. అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై చర్చ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే మరో వైసీపీ నేత అదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కామెంట్స్ తో మళ్లీ కలకలం రేపారు.

జగన్ పై కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి టీడీపీ అధినేత చంద్రబాబు హాని తలపెడతారని రోజూ భయపడుతున్నామని అన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీని చంపేందుకు చంద్రబాబు సామాజికవర్గం చందాలు పోగు చేస్తోందని ఆరోపించారు. గతంలో.. సీఎం గాల్లో కలిసిపోతాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నారాయణ స్వామి గుర్తు చేశారు.

WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్

చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. పేదల సంక్షేమ కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ను ప్రతి రోజూ అవనమానకరంగా మాట్లాడుతున్నారని నారాయణ స్వామి వాపోయారు. ఇటీవల చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సమావేశం పెట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును చంపుతామని బెరించారని.. వారిని హతమార్చేందుకు చందాలు కూడా పోగుచేస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. కమ్మ వనసమారాధనలో చేసిన వ్యాఖ్యలను తామంతా ఖండిస్తే.. చంద్రబాబు కనీసం ఖండించలేదని అన్నారు. ఎక్కడ చూసినా హత్యలు జరిపించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఉన్నట్లున్నారని విమర్శించారు. సీఎం జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?

నిన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, నేడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. జగన్ పై కుట్ర జరుగుతోందని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.