Ukraine : యుక్రెయిన్‌లో తెలుగు వాళ్ల కోసం కంట్రోల్ రూమ్.. నెంబర్స్ ఇవే
సీఎం ప్రతి రోజు సమీక్షిస్తున్నట్లు, ప్రతి విద్యార్థిని ట్రేస్ చేసి రోడ్డు మార్గంలో బోర్డర్ వరకు తీసుకోస్తామన్నారు. అక్కడ నుండి విమానంలో ఇండియాకు రప్పించడం జరుగుతుందన్నారు...

Ap Cs
AP CS Sameer Sharma : ఉక్రెయిన్ లో తెలుగు వాళ్ళ కోసం సీఎం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యమన్నారని ఏపీ చీప్ సెక్రటరీ సమీర్ శర్మ తెలిపారు. కృష్ణ బాబు, అరుణ్ కుమార్, దినేష్ కుమార్, గీతేష్ శర్మలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 1902కి కాల్ చేసి పిల్లల వివరాలు తెలపొచ్చని, ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. అక్కడికి చేరే వారిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, 48660460814, 48606700105 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. వారిని సమన్వయ పరిచేందుకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, ఇప్పటికి 130 మంది కాల్ చేశారన్నారు. వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉంటారని, ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Read More : Ukraine AP Students : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సీఎం జగన్ ఫోన్
సీఎం ప్రతి రోజు సమీక్షిస్తున్నట్లు, ప్రతి విద్యార్థిని ట్రేస్ చేసి రోడ్డు మార్గంలో బోర్డర్ వరకు తీసుకోస్తామన్నారు. అక్కడ నుండి విమానంలో ఇండియాకు రప్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. అందరిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పెషల్ ఆఫీసర్ గీతేష్ శర్మ తెలిపారు. తాము ఎంబసీ, విదేశీ వ్యవహారాల శాఖలతో టచ్ లో ఉన్నట్లు, సీఎం అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. కేంద్రానికి కూడా సీఎం జగన్ లేఖ రాశారనే విషయాన్ని ప్రస్తావించారు. అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం నుండి సహకారం అందించడం జరుగుతోందని, ఏపీ విద్యార్థులకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. అక్కడున్న విద్యార్థులతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. పేరు, ఉక్రెయిన్ లోని అడ్రెస్ వివరాలు తెలుసుకుంటున్నట్లు అహ్మద్ బాబు తెలిపారు.
సమీప సరిహద్దు వివరాలను తెలుసుకుంటున్నట్లు, 4 సరిహద్దు ప్రాంతాలకు 4 టీమ్ లు వెళ్తున్నాయన్నారు. పోలాండ్, హంగ్రీ, రొమానియా సరిహద్దు ప్రాంతాల్లో టీమ్ లను పెట్టినట్లు వెల్లడించారు.
Read More : రష్యా-ఉక్రెయిన్ వార్.. నిరంతర పేలుళ్లు.. 137మంది మృతి
మరోవైపు…కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని కోరారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని జగన్‌కు తెలిపారు జైశంకర్. యుక్రెయిన్ నుంచి పక్కదేశాలకు తరలించి అక్కడ నుంచి.. ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను తీసుకొచ్చేలా చర్యలు చేపట్టామని చెప్పారు.
అంతకుముందు సీఎం వైఎస్.జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు అధికారులు. కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలన్నారు సీఎం జగన్.