ఏపీలో కరోనా..వివరాలు మీ చేతుల్లోనే

  • Published By: cln raju ,Published On : April 22, 2020 / 07:34 AM IST
ఏపీలో కరోనా..వివరాలు మీ చేతుల్లోనే

Updated On : April 22, 2020 / 7:34 AM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో పరీక్షల్లో 56 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. మొత్తం 813 పాజిటివ్ కేసులకు గాను..120 మంది డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. ప్రస్తుతం 669 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు 2020, ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

GGH నెల్లూరు జిల్లాలో పాజిటివ్ గా నిర్ధారించబడిన ఒక కేసు ప్రకాశం జిల్లాకు సంబంధించిందిగా వెల్లడించింది. దీనివల్ల ప్రకాశం జిల్లాకు బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. 24 గంటల్లో 5757 శాంపిల్స్ పరీక్షిస్తే… 56 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారని తెలిపారు. 

రాష్ట్రంలో కొత్తగా డిశ్చార్జ్ వివరాలు : 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో గుంటూరు 8, అనంతపూర్ 5, కడప 4, నెల్లూరు 4, కృష్ణా 2, విశాఖ ఒక్కరు డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. మొత్తంగా 120 మందిని ఇంటికి పంపించినట్లైంది. 

మరణాలు : గుంటూరు జిల్లాలో కోవిడ్ తో ఇద్దరు మరణించారు. మొత్తం 24 మంది చనిపోయారు. కరోనాకు సంబంధించిన అధికారిక సమాచారం ఇక అందరూ తెలుసుకోవచ్చు. వాట్సాప్ చాట్ నెంబర్ (8297-104-104)  Hi, Hello, Covid అని మేసేజ్ చేయండి. స్మార్ట్ ఫోన్ లేని వారు..(8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వారా కరోనాకు సంబంధించిన సమాచారం, సహాయం పొందచవచ్చు. 

104 టోల్ ఫ్రీకు ఫోన్ చేసి కరోనాకు సంబంధించి వైద్య సమస్యలు తెలుసుకోవచ్చు. వై.ఎస్.ఆర్. టెలిమెడిసిన్ నంబర్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి…ఫోన్ ద్వారా…డాక్టర్ తో మాట్లాడవచ్చు. https://esanjeevaani.com/ వెబ్ సైట్ ద్వారా డాక్టర్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం. కరోనాకు  సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. 104 హెల్ప్ లైన్, COVID డాష్ బోర్డ్ COVID డాష్ బోర్డ్ కై https://hmfw.ap.gov.in/covid_dashboard.aspx