ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయ్….

ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఒక్కరోజు 10,171 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1842 మంది మృతి చెందారు. ఏపీలో 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 1,20,464 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1270 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తూ.గో జిల్లాలో మొత్తం కేసులు 30 వేలకు చేరువయ్యాయి. కర్నూలు జిల్లాలో 1331 కేసులు నమోదవ్వగా మొత్తం కరోనా బాధితులు 24,679కి చేరుకున్నారు. 62,938 శాంపిల్స్ పరీక్షించగా 10,171 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అనంతపురం జిల్లా 1100, చిత్తూరు 980, గుంటూరు 817, కడప 596, కృష్ణా 420, నెల్లూరు 941, ప్రకాశం 337, శ్రీకాకుళం 449, విశాఖపట్నం 852, విజయనగరం 530, పశ్చిమ గోదావరి 548 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
చిత్తూరు 10, అనంతపురం 9, గుంటూరు 9, నెల్లూరు 9, పశ్చిమ గోదావరి 9, తూర్పుగోదావరి 7, కడప 7, ప్రకాశం 7, తూర్పు గోదావరి 7, కడప 7, కర్నూలు 5, విశాఖ 5, శ్రీకాకుళం 3, విజయనగరం ముగ్గురు చొప్పున మృతి చెందారు.