Corona Effect Tirumala : కరోనా ఎఫెక్ట్ : శ్రీవారి దర్శనాల సంఖ్య తగ్గింపు
తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది.

Corona Effect Tirumala
Corona effect on the visits of Tirumala : తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను 30 వేల నుంచి 15 వేలకు కుదించారు. ఈ నెల 20 నుంచి ఆన్ లైన్ లో 15 వేల దర్శన టికెట్లు అందుబాటులో ఉండున్నాయి. ఇప్పటికే సర్వదర్శనం
టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 6 వేల 582 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
35 వేల 222 శాంపిల్స్ పరీక్షించారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, విశాఖపట్టణంలో, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.