AP Secretariat Corona : ఏపీ సచివాలయంపై కరోనా పంజా : 100 మందికిపైగా ఉద్యోగులకు పాజిటివ్, 8 మంది మృతి

ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసురుతోంది. 8 మంది సచివాలయ ఉద్యోగులు కరోనాతో మరణించడంతో.. సెక్రటేరియట్‌ ఆఫీసర్లకు వైరస్‌ టెన్షన్‌ పట్టుకుంది.

AP Secretariat Corona : ఏపీ సచివాలయంపై కరోనా పంజా : 100 మందికిపైగా ఉద్యోగులకు పాజిటివ్, 8 మంది మృతి

Corona Positive For More Than 100 Employees In The Ap Secretariat 8 Dead

Updated On : May 1, 2021 / 11:42 AM IST

Corona cases in the AP Secretariat : ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసురుతోంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 8 మంది సచివాలయ ఉద్యోగులు కరోనాతో మరణించడంతో.. సెక్రటేరియట్‌ ఆఫీసర్లకు వైరస్‌ టెన్షన్‌ పట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ భయంతో ఉద్యోగులు వణికిపోతున్నారు. ఒక్కొక్కరుగా ఉద్యోగులు మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇంకా అనేక మంది సచివాలయ ఉద్యోగులు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా కరోనా సోకవడంతో పాటు.. అందులో ఎనిమిది మంది వరకూ మరణించినట్లు తెలుస్తోంది.

కరోనా భయంతో సచివాలయంలో ఉద్యోగుల హాజరు పలచబడింది. కేసులు పెరుగుతుండటంతో విధులకు హాజరై ప్రాణాలమీదకి తెచ్చుకునేకన్నా సెలవుపెట్టి ఇంటివద్ద ఉండటమే మేలనే భావనతో ఉద్యోగులున్నారు. కొన్ని శాఖల్లో ఒకరిద్దరే కనిపిస్తున్నారు. కరోనా రెండోదశ తీవ్రత, తమ తోటి ఉద్యోగులు మరణిస్తుండటం.. 100 మందికిపైగా కరోనా బారిన పడటం వంటి కారణాల వల్ల ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే.. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులు ఎక్కువ మంది వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తపడింది. ఉద్యోగుల మధ్య భౌతికదూరం పెంచడానికి వీలుగా వారం రోజుల నుంచి సచివాలయంలో అనధికారికంగా రొటేషన్‌ పద్ధతి అమలవుతోంది.

రోజూ సెక్షన్‌కు ఒక్కరు హాజరైతేచాలని అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయానికి వచ్చి పనిచేయలేమని చెబుతున్నారు ఉద్యోగులు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.