తిరుపతిలో కరోనా టెర్రర్ : రుయాలో చేరిన ఇద్దరు..ఐదు దేశాలను చుట్టి వచ్చిన యువతి!

  • Published By: madhu ,Published On : March 15, 2020 / 08:49 AM IST
తిరుపతిలో కరోనా టెర్రర్ : రుయాలో చేరిన ఇద్దరు..ఐదు దేశాలను చుట్టి వచ్చిన యువతి!

Updated On : March 15, 2020 / 8:49 AM IST

భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో రుయా ఆసుపత్రిలో చేరుతున్నారు. తాజాగా ఆస్ట్రియా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. 

రుయా ఆసుపత్రిలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు 2020, మార్చి 15వ తేదీ ఆదివారం అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన వారిలో ఓ యువతి ఉంది. ప్రత్యేక కరోనా ఐసోలేషన్ వార్డులో వీరికి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరూ కూడా 25 సంవత్సరాల లోపులో ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడు తిరుపతి వాసిగా గుర్తించారు. ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన ఈ యువకుడికి జలుబు, దగ్గుతో బాధ పడుతున్నాడు.

ఇక ఆస్పత్రిలో చేరిన యువతి..ఏకంగా ఐదు దేశాల చుట్టి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలు బయటపడడంతో వీరిద్దరి నుంచి నమూనాలు సేకరించి..స్విమ్స్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఈ రిపోర్ట్స్ రావడానికి 24 గంటల సమయం పడుతుంది. నివేదికలు వచ్చిన తర్వాతే..వీరికి కరోనా..వ్యాధి ఉందా ? లేదా ? అనేది తేలనుంది. యువకుడు, యువతిలను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని రుయా వైద్యులు అంటున్నారు. 

మరోవైపు …
* శ్రీ వారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
* భక్తులు వేచి ఉండే విధానానికి స్వస్తి చెప్పాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా టైమ్ స్లాట్ టోకెన్లు ఇచ్చి..శ్రీ వారి దర్శనం కల్పించనున్నారు. 

* స్వామి వారికి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. 
* స్వామి వారికి ప్రతి సోమవారం..ఉదయం విశేష పూజ, మధ్యాహ్నం వసంతోత్సవం ప్రతి బుధవారం కలశాభిషేకం సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. 
* భక్తులకు ముందుగానే టోకెన్లు ఇస్తామని, నేరుగా శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉందని అంటున్నారు. 
 

Read More : కరోనా భయం..భయం : ఏపీలో వారం రోజుల పాటు స్కూల్స్ బంద్!