CoronaVirus:భయం నిజమైంది, శ్రీకాకుళం జిల్లాని తాకిన కరోనా, ముగ్గురికి పాజిటివ్, కారణం అతడేనా

పీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొవిడ్ కేసులు నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ రెండు జిల్లాలు నిన్నటివరకు కరోన

CoronaVirus:భయం నిజమైంది, శ్రీకాకుళం జిల్లాని తాకిన కరోనా, ముగ్గురికి పాజిటివ్, కారణం అతడేనా

Updated On : December 30, 2021 / 10:42 AM IST

CoronaVirus:ఏపీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొవిడ్ కేసులు నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ రెండు జిల్లాలు నిన్నటివరకు కరోనా ఫ్రీగా ఉన్నాయి. ఈ విషయం ప్రభుత్వానికి కొంత ఊరట ఇచ్చింది. అయితే ఆ ఆనందం ఆవిరైంది. భయం నిజమైంది. కరోనా వైరస్ శ్రీకాకుళం జిల్లాని కూడా తాకింది. తొలిసారి జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పాతపట్నంలో ఆ మూడు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయనే వార్తతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం(ఏప్రిల్ 25,2020) వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కేసులపై బులెటిన్ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు నమోదైనట్టు చెప్పారు.

మార్చిలో ఢిల్లీ నుంచి శ్రీకాకుళం వచ్చిన వ్యక్తి:
మార్చిలో ఢిల్లీలో పనిచేసే వ్యక్తి తన సొంత ఊరైన శ్రీకాకుళం జిల్లాకు వచ్చాడు. ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కానీ నాలుగైదు రోజుల క్రితం అతడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే అతడి శాంపిల్స్ సేకరించి మూడు రోజుల క్రితం ల్యాబ్‌కు పంపారు. కానీ అతడికి నెగిటివ్ రాగా.. అతడు కలిసిన ముగ్గురికి పాజిటివ్ తేలినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురికి కరోనా నిర్థారణ కావడంతో.. వారితో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురిని క్వారంటైన్‌కు తరలించారు.. అలాగే బాధితులు ఉంటున్న ప్రాంతంలో శానిటేషన్ చేపట్టారు. స్థానిక ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు.

ఏపీలో ఎక్స్ ప్రెస్ లో అత్తారింటికి వచ్చాడు:
సదురు వ్యక్తి తబ్లీగ్ జమాత్‌ కి వెళ్లి వస్తున్న వారితో కలిసి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. సొంత ఊరికి రాగానే హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత అతడు బయటకు వచ్చి కొందరిని కలిసినట్లు సమాచారం. ఆ వ్యక్తికి ముందు ర్యాపిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రావడంతో.. ట్రూనాట్ పరికరం ద్వారా రిమ్స్‌లో మరోసారి పరీక్షించారు.. ఆ శాంపిళ్లను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌కు పంపించగా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి నెగిటివ్ రాగా.. విచిత్రంగా అతడు కలిసిన ముగ్గురికి పాజిటివ్ తేలింది.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలానికి చెందిన సదురు యువకుడు ఢిల్లీలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చిలో ఢిల్లీ నుంచి వచ్చిన అతడు అధికారుల సూచనల మేరకు 14 రోజులపాటు అత్తారింట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత బయటకు వచ్చి కొందరిని కలిసినట్లు సమాచారం. అతడికి భార్య, ఓ చిన్న బాబు ఉన్నారు.

1,442 మంది విదేశాల నుంచి శ్రీకాకుళం వచ్చారు. వారిలో 1422మంది 28 రోజుల హోంక్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్నటివరకు మొత్తం 4వేల 439 నమూనాలు పరిశీలించగా, 3వేల 250 మందికి నెగిటివ్ వచ్చింది. 1189మంది రిజల్స్ట్ కోసం వేచి చూస్తున్నారు. వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు:
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల్లో ఏపీ తెలంగాణను దాటేసింది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటాయి. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. ఇప్పటివరకు 171 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇప్పటివరకు 275 కేసులు, గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.