కరోనా : చైనా నుంచి వచ్చిన కుటుంబంపై రుయా సిబ్బంది నిర్లక్ష్యం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొత్త భూతం కరోనా వైరస్ 25 దేశాల్లో విస్తరించింది. చైనాలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వేల మందికి ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. ప్రపంచాన్ని మొత్తం WHO అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాల్సిన రుయా ఆస్పత్రి సిబ్బంది మొద్దు నిద్ర వీడడం లేదు. తాము చైనా నుంచి వచ్చామని..కరోనా వైరస్ ఉందో ? లేదో చెక్ చేయాలని, రక్తపు పరీక్షలు చేయాలని అన్న ఓ కుటుంబాన్ని అసలు పట్టించుకోలేదు. ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై అంతర్గత విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఏం జరిగింది..
పీలేరులోని అరీపుల్లా కుటుంబం (నలుగురు వ్యక్తులు) ఇటీవల చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లి వచ్చారు. తిరిగి వారు భారతదేశానికి బయలుదేరారు. చైనా, ఢిల్లీ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన..స్ర్కీనింగ్ టెస్టులో వీరికి కరోనా వైరస్ లేదని నిర్ధారించారు. కానీ ఎందుకైనా రక్త పరీక్షలు చేయించుకుని కరోనా వైరస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని అక్కడది వైద్యులు సూచించారు.
ఈ సమస్యను DMHO అధికారులకు తెలియచేశారు. వెంటనే రుయా ఆస్పత్రికి వెళ్లి రక్తం ఇవ్వాలని, పూణెకు పంపించి..రిపోర్టు అందచేస్తామని వెల్లడించారు. దీంతో అధికారుల సూచన మేరుకు వీరంతా 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం రుయా ఆస్పత్రికెళ్లారు. కానీ అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓపీ దగ్గరకు వెళ్లండి..టికెట్ తీసుకరావాలంటూ..ఇష్టమొచ్చినట్లు చెబుతూ..పట్టించుకోలేదు.
వారికి కేటాయించిన వార్డులో గంటకు పైగా వెయిట్ చేసినా వైద్యులెవరూ రాకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వారు ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు. అనంతరం వైద్య పరీక్షల కోసం బెంగళూరు వెళ్లారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ ప్రారంభించి..నివేదిక అందచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Read More : కర్నూలులో శిశువు కిడ్నాప్ సుఖాంతం..ముక్కుపుడక పట్టించింది