Chandrababu Cases : చంద్రబాబు కేసులపై ఉత్కంఠ, మూడు కోర్టులు నుంచి తీర్పులు వచ్చే అవకాశం
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు, మరోపక్క ఏసీబీ కోర్టుల్లో తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి. దీంతో చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభిస్తుందా..? అనే ఉత్కంఠ నెలకొంది

Chandrababu Quash Petition
Chandrababu Case Supreme Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు, మరోపక్క ఏసీబీ కోర్టుల్లో తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి. దీంతో చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభిస్తుందా..? అనే ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై విచారణ జరిగి ఈరోజే తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఏసీబీ కోర్టులో బెయిల్, సీఐడీ కస్టడీ పిటీషన్లపై వాదనలు ముగిసినా తీర్పు రిజర్వులోనే ఉంది. అలాగే హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. దీంతో చంద్రబాబు కేసులపై తీర్పు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందనే ఆరోపణలో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈకేసుక సంబంధించిన ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం (అక్టోబర్ 9,2023) విచారణ జరపనుంది. అలాగే ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వులు పెట్టిన క్రమంలో ఈరోజు తీర్పు వెల్లడించనుంది.
ఆశావర్కర్ కుటుంబానికి లోకేశ్ రూ.2లక్షల ఆర్థిక సాయం
దీంతో పాటు మరోసారి పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై కూడా ఈరోజు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై శుక్రవారమే ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. కానీ తీర్పును వెలువరించలేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా మూడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం తీర్పులను రిజర్వు చేసింది. ఈ మూడు బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి ఇవాళ తీర్పు వెలువడే అకాశాలుండటంతో ఎటువంటి తీర్పులు వస్తాయా..? అనే ఉత్కంఠ నెలకొంది.