Covid Cases In AP : 24 గంటల్లో 212 కేసులు, ముగ్గురు మృతి

Covid Cases In AP : 24 గంటల్లో 212 కేసులు, ముగ్గురు మృతి

Updated On : December 28, 2020 / 4:34 PM IST

Covid Cases In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 28 తేదీ సోమవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 37 వేల 381 శాంపిల్స్ పరీక్షించినట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 410 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, ఆదివారం వరకు రాష్ట్రంలో 1,16,57,884 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 81 వేల 273కి కరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 3 వేల 423 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 70 వేల 752 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా :
అనంతపురం : 13. చిత్తూరు 42. ఈస్ట్ గోదావరి : 21. గుంటూరు : 53. కడప : 09. కృష్ణా : 32. కర్నూలు : 04. నెల్లూరు : 07. ప్రకాశం : 08. శ్రీకాకుళం : 05. విశాఖపట్టణం : 13. విజయనగరం : 00. వెస్ట్ గోదావరి : 05. మొత్తం 212.

రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,16,57,884. కేరళ : 76,95,117. కర్నాటక : 1,37,04,709. తమిళనాడు : 1,39,24,527. తెలంగాణ : 67,23,710. గుజరాత్ : 94,37,105. మహారాష్ట్ర : 1,25,02,554. రాజస్థాన్ : 51,73,485. మధ్యప్రదేశ్ : 45,31,859. ఇండియా : 16,88,18,504.