Train Services Cancelled : కరోనా ఎఫెక్ట్ : రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

Trains Canceled
Covid Effect SCR Cancelled train services in some routes : కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు రైళ్లు బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరిపరిస్ధితుల్లోనే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఇంతకు ముందు చేసుకున్న రిజర్వేషన్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పలు రైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
ఏప్రిల్ 28- మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. అదే తేదీల్లో సికింద్రాబాద్-బీదర్, బీదర్ -హైదరాబాద్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇవి కాక……
ఏప్రిల్ 28- మే 31 వరకు- సికింద్రాబాద్ -కర్నూలు ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 29- జూన్ 1 వరకు – కర్నూలు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 30- మే 28 వరకు మైసూర్-రేణిగుంట ఎక్స్‌ప్రెస్
మే 1-మే 29 వరకు వరకు రేణిగుంట-మైసూర్ ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 30- మే 28 వరకు సికింద్రాబాద్- ముంబయి ఎల్‌టీటీ