Covid Vaccination: ఏపీ నయా రికార్డ్.. ఒక్క రోజులో 7.88లక్షల మందికి వ్యాక్సినేషన్‌

దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ నయా రికార్డ్ లిఖించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఒక్క రోజులోనే 7.88లక్షల మందికి పైగా వ్యాక్సినే వేసింది.

Covid Vaccination: ఏపీ నయా రికార్డ్.. ఒక్క రోజులో 7.88లక్షల మందికి వ్యాక్సినేషన్‌

Covid Vaccination Record In Andhra Pradesh

Updated On : June 20, 2021 / 4:30 PM IST

Covid Vaccination: దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ నయా రికార్డ్ లిఖించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఒక్క రోజులోనే 7.88లక్షల మందికి పైగా వ్యాక్సినే వేసింది. ఉదయం 6 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటల సమయం వరకూ వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి సంఖ్య 7లక్షల 88వేల 634గా రికార్డ్ సృష్టించింది.

ఈ ప్రక్రియ మొత్తంలో ఇప్పటివరకూ.. మొత్తంగా కోటి 33లక్షల 93వేల 359 టీకాలను లబ్దిదారులకు వేయగలిగారు. మొదటి డోస్‌లో భాగంగా కోటి 6లక్షల 91వేల 200 డోసులు వేశారు. సెకండ్ డోస్ 27లక్షల 2వేల 159 మందికి వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

కోవిడ్ వైరస్ మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో ఈ మహత్కార్యానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం ఒక్క రోజే 8 లక్షల టీకాలు వేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు తగ్గట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేసింది.