Srinivasa Rao : ఎన్డీఏ భేటీకి ఎందుకెళ్లారు.. ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి : సీపీఎం నేత శ్రీనివాసరావు

మోదీ పాలనలో అంబానీ, అదానీలు లాభ పడ్డారని, పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోయారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని వెల్లడించారు.

Srinivasa Rao : ఎన్డీఏ భేటీకి ఎందుకెళ్లారు.. ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి : సీపీఎం నేత శ్రీనివాసరావు

CPM Secretary Srinivasa Rao Questioned Pawan Kalyan Over NDA Meeting

Updated On : July 19, 2023 / 12:49 PM IST

CPM Secretary Srinivasa Rao : దేశంలో రాజకీయ మార్పులు ప్రారంభం కానున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. మోదీ ఓటమి భయంతో అత్యవసరంగా ఎన్డీఏ సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న వాటిలో 14 పార్టీలకు మాత్రమే చట్ట సభల్లో ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

మోదీ పాలనలో అంబానీ, అదానీలు లాభ పడ్డారని, పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోయారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని వెల్లడించారు. మోదీ ఏ హామీలు అమలు చేశారని పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని హామీలను తుంగలో తొక్కి మోదీ ఏపీకి అన్యాయం చేశారని విమర్శించారు.

Jeevitha – Rajasekhar : పరువు నష్టం దావా కేసులో జీవిత, రాజశేఖర్ కు జైలుశిక్ష.. బెయిల్ మంజూరు

పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా, పోలవరంపై టీడీపీ, వైసీపీ గళమెత్తాలన్నారు. పార్లమెంటు బయట అయినా నిరసనలు తెలపాలని తెలిపారు. వైసీపీ, టీడీపీ, జనసేనలను బీజేపీ ఆడిస్తుందని వెల్లడించారు. ఏపీలో ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినట్లే అన్న విధంగా ఉందన్నారు. బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం ఆ మూడు పార్టీలు నడుస్తున్నాయని ఆరోపించారు. పొత్తులపై అధ్యయనం చేస్తుంది బీజేపీనా, జనసేననా అనేది చెప్పాలన్నారు.

ఢిల్లీ పెద్దలు చెప్పిందే మూడు పార్టీలు ఆచరిస్తున్నాయని విమర్శించారు. లౌకికవాద పార్టీలు అంటూనే బీజేపీకి ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి సివిల్‌ కోడ్ విషయంలో టీడీపీ, వైసీపీ విధానం ఏమిటో‌ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలను అణచి వేయాలనే ఉమ్మడి సివిల్ కోడ్ తీసుకొస్తున్నాయని విమర్శించారు.

AP Heavy Rains : ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

లోపాయికారీ రాజకీయాలకు వైసీపీ, టీడీపీ స్వస్తి చెప్పాలన్నారు. పార్లమెంటులో ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల ఏపీకి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తే పార్టీలకే ప్రజలు పట్టం కట్టాలని కోరారు.